ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 02:54 PM

లోకేశ్‌ యువగళం విజయవంతం కావడంతో వైసీపీ ఖేల్‌ ఖతం, దుకాణ్‌ బంద్‌ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో కోటి మంది దళితుల్లో, మాకొద్దు ఈ జగన్‌ అని నినదించడానికి లక్షలాది మంది దళితులు యువగళం ముగింపు సభకు వచ్చారు. టీడీపీ, జనసేన సమ్మిళితాన్ని అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. యువగళం ముగింపు సభ జగన్‌ పాలనకు చరమగీతం పాడింది. యువగళం ముగింపు సభకు వైసీపీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి, టీడీపీ-జనసేన కూటమికి అధికారం ఇచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు’’ అని వర్ల చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com