తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ లైన్మెన్లు గురువారం విజయనగరం జిల్లా, దత్తిరాజేరు ఎంపీడీవో ఎంవీ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రొబిషన్ డిక్ల రేషన్ జేఎస్డబ్ల్యూఎస్ ద్వారానే చేసి ఎస్ఆర్లు ఓపెన్ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల వలే 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ఎనర్జీ అసిస్టెంట్, సెక్రటరీలను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని, కేటాయించిన సచివాలయ పరిధిలోనే పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని, ఈహెచ్ఎస్ హెల్డ్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో ఎంవీ సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఎల్ఎంలు పాల్గొన్నారు.