సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనంతపురం ఎస్పీ మాధవరెడ్డి సిబ్బందికి సూచించారు. ముదిగుబ్బ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషనను గురువా రం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలు రికార్డులు పరిశీలించా రు. నేరాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని సమస్యాత్మక గ్రామాలపై, రౌడీ షీటర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పల్లెనిద్ర చేసి పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ పృథ్వీతేజ్, ముదిగుబ్బ సీఐ యతీంద్ర, ఎస్‌ఐ వంశీకృష్ణ, పట్నం ఎస్‌ఐ ఇషాక్ బాషా తదితరులు పాల్గొన్నారు.