పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఉదయం 5.30 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.4గా నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
భూమికి 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.