ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా లోకేష్‌పై సీఐడీ మెమో,,,ఏసీబీ కోర్టులో దాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 06:43 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సమర్పించారు. యువగళం‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది.. కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా వివాదాద్పద వ్యాఖ్యలు చేశారంటోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని లోకేష్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ మెమోలో ప్రస్తావించారు.


స్కిల్, అమరావతి ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ కేసులలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అంటోంది సీఐడీ. అధికారులు 164 సీఆర్‌పీసీ కిం వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్‌లో పేర్లు రికార్డు చేశానని.. తమ ‌ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారంటోంది సీఐడీ. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం అంటున్నారు. దీన్ని కూడా లోకేష్ తప్పుబట్టడ సరికాదంటున్నారు. సాక్షులని బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా ఉందని సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకి విరుద్దమంటోంది సీఐడీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com