ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తిపై జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 06:37 PM

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఈ వేరియంట్ సోకిన వ్యక్తులకు సాధారణ చికిత్సతోనే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్దే కోలుకుంటున్నారని వివరించారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని, అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ అందుబాటులోకి ఉంచుతున్నట్టు తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్‌కు అధికారులు చెప్పారు.


అవసరమైన ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయని, ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ మౌలికవసుతులను సిద్ధంచేస్తున్నట్టు సమీక్షలో వెల్లడించారు. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని, అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి సమగ్ర వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ... ఈ వేరియంట్‌ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నా.. ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలని ఆదేశించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, విలేజ్‌ క్లినిక్‌‌లను ముందస్తు చర్యలకోసం అప్రమత్తం చేయాలన్నారు. కొత్తవేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలి సీఎం సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ స్ఫష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com