రాజమహేంద్రవరంలో కరోనా కలకలం రేపింది. దానవాయిపేటకు చెందిన వృద్ధురాలి(84)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కంబాలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్యం సిబ్బంది ఆమెను హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 20న నమూనాలు సేకరించి కాకినాడలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌కు పంపారు. 21న పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.