కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసింది. అదనపు వాయిదాల కింద మొత్తం రూ.72,961.21కోట్లను రిలీజ్ చేసింది. ఈ మొత్తంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రూ.13,089కోట్లు, బిహార్ రూ.7,338 కోట్లు అందుకున్నాయి.
ఏపీకి రూ.2952.74 కోట్లు, తెలంగాణకు రూ.1533.44 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటంతో గత రెండేళ్లుగా ఈ అదనపు వాయిదాలను కేంద్రం ముందుగానే విడుదల చేస్తోంది.