వైసీపీ నాయకులూ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర చరిత్ర పుటల్లో లిఖించబడుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆయన మాట్లాడుతూ..... గతంలో మహానుభావులెందరో..ఈ దేశంలో సామాజిక సాధికారత సాధించాలని ఉద్యమాలు చేశారు. ఈ రాష్ట్రంలో...ఆ మహనీయుల ఆశయాల బాటలో నడిచి..మనకు సామాజిక సాధికారత అందించారు సీఎం జగనన్న. గతంలో చంద్రబాబు మనల్ని బెదిరించారు. చులకనగా మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలు గుండెల మీద చెయ్యివేసుకుని ముందుకు నడుస్తున్నారు. ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఆయా వర్గాల ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు జగనన్న. మన జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మన పిల్లల భవిష్యత్ గురించి ..ఎంతో ముందుచూపుతో పథకాలు అమల్లోకి తెచ్చారు.విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడం మన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చాలా చాలా అవసరం అని తెలిపారు.