ప్రత్యర్థి చంద్రబాబు గారు రాజకీయంగా చేసిన అరాచకాలు మనకందరికీ తెలుసు. ప్రత్యేకహోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమని చెప్పి, స్పెషల్స్టేటస్ను వదిలేసిన బాపతు రాజకీయనాయకుడు చంద్రబాబు అని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పదేళ్లపాటు అక్కడ నుంచి పాలన చేసే అవకాశం ఉన్నా, వదిలేసి వచ్చిన వాడు చంద్రబాబు. చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తన హయాంలో ఎన్నెన్ని స్కాములు చేశాడో లెక్కకు మించి ఉంటాయి. వ్యవసాయం దండగ అని పనికిమాలిన మాటలు మాట్లాడిన నాయకుడు చంద్రబాబు. ఉచితవిద్యుత్ అడిగితే, విద్యుత్ బిల్లులపై ఉద్యమం చేస్తే, హైద్రాబాద్లో రైతులపై గుర్రాలతో తొక్కించి, కాల్పులు చేపించిన రాక్షసుడు బాబు. ఇక ఎస్సీ,ఎస్టీ,బీసీలను కులం పేరిటే చులకన చేసి మాట్లాడారు –చంద్రబాబు.మైనార్టీలను దేశద్రోహుల కింద లెక్కేసిన దుర్మార్గుడు. వారిపై కేసులు కూడా పెట్టారు అని తెలిపారు.