అర్హతలున్న లబ్దిదారుల్లో ఏ ఒక్కరూ సంక్షేమపథకాల లబ్ది పొందకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ తపిస్తున్నారు అని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఆయన మాట్లాడుతూ..... ఇంటి గడప దగ్గరకే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చేస్తున్నారు. వివక్ష లేకుండా, లంచాలు లేకుండా, పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత జగనన్న ప్రభుత్వానిదే. సమాజంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా వుంటేనే, బాగా చదువుకుని ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. నాడు–నేడు పథకంతో విద్య,వైద్యరంగాల్లో జగనన్న తెచ్చిన మార్పులు అద్భుతమైనవి. అవి పేదల జీవితాల్లో ఎంత వెలుగులు నింపుతున్నాయో మనకందరకు తెలుసు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో ఆ సామాజికాభివృద్ది స్పష్టంగా కనిపించి తీరుతుంది అని ధీమా వ్యక్తపరిచారు.