వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు..ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీ వెంబడి నడిచిన జనం... బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ పూర్తయ్యేవరకు ఏ ఒక్కరూ కదలకపోవడం విశేషం. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, గురుమూర్తి పాల్గొన్నారు. ఇంకా స్థానిక సంస్థలు ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు