సీఎం జగన్ మరోసారి ఆపన్నులకు అండగా నిలిచారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో నిన్న 21వ తేదీన తన పర్యటనలో భాగంగా ఆయన పలువురు నుంచి వినతులు స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి మందులు, వైద్య, ఇతర అవసరాల కోసం వచ్చిన వినతుల పట్ల సానుకూలంగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలని ఉదారంగా ఆదుకోవాలని అక్కడే ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో ముగ్గురు భాదితులకు లక్ష రూపాయలు చొప్పున మూడు లక్షల రూపాయలను నేరుగా లబ్దిదారుల ఖాతాలకు ఆర్థిక సహాయంగా జమ చేసారు. ముఖ్య మంత్రి ఆదేశించిన 24 గంటల్లోనే ఈ ఆర్ధిక సహాయం అందజేయటం గొప్ప విషయమని లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.