ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు క్రిస్టియన్ల ఆస్తులను కొల్లగొట్టారనే విషయంగా బహిరంగ చర్చకు సిద్ధమా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2023, 01:02 PM

రాష్ట్రంలో క్రైస్తవుల ఆస్తులను ఆక్రమించిందీ, అమ్ముకున్నది చంద్రబాబు, ఆయన అనుచరులేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వాళ్లు కూడా క్రైస్తవుల ఆస్తులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అన్యాక్రాంతం చేసి అక్రమంగా కొట్టేశారని అన్నారు. క్రైస్తవుల ఆస్తులను ఎవరు ఆక్రమించి అమ్ముకున్నారో నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చంద్రబాబుకు దమ్ముంటే తమతో వస్తే అమరావతి రాజధాని  ప్రాంతంతో సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కొల్లగొట్టిన క్రైస్తవ ఆస్తులను చూపుతామని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరు క్రిస్టియన్ల ఆస్తులను కొల్లగొట్టారనే విషయంగా బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబును నిలదీశారు. ఈ విషయంగా ఎక్కడికైనా వచ్చి బహిరంగంగా చర్చించడానికి, టీడీపీ నేతలు అమ్ముకుతిన్న క్రైస్తవుల  ఆస్తులను చూపించడానికి కూడా తాము సిద్దమేనని నాగార్జున సవాల్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com