సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీలో పేదలకు, బడుగు, బలహీన, దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ప్రారంభించారని, ఇప్పటివరకు ఇచ్చింది 20 లక్షల మందికి మాత్రమేనని తెలిపారు. అణగారిన వర్గాలకు గౌరవం అనేది విద్యతో వస్తుందని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. పేదలకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనందరం మరోసారి సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.