కళ్యాణదుర్గంలో గత 12రోజులుగా నిర్విరామంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు శనివారం విశ్రాంత ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి, గౌరవ అధ్యక్షులు మారెన్న మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ రూ. 5లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.