మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శనం చేసుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించి శ్రీవారికి సేవ చేసే గొప్ప గౌరవపదమైన భాగ్యాన్ని కల్పించారని తెలిపారు.