రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమైంది. ఎన్నికల సన్నద్ధత, ఓట్ల జాబితాపై, టీడీపీ - వైసీపీ లు చేస్తున్న ఆరోపణల పై 18 మంది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు నివేదిక ఇచ్చారు. ఈ రోజు మరో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నివేదిక ఇవ్వనున్నారు. సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి పాల్గొననున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ కమిషనర్ లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హిర్ధేశ్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన తో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు.