ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. ఓటర్ల పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోగా పూర్తిగా పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం కలెక్టర్ మాధవీలత తెలిపారు. విజయవాడలో శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి కలెక్టర్ డా. కె.మాధవీలత,ఎస్పీ పి.జగదీశ్ హాజరయ్యారు. తొలుత కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా, ఎస్పీ శాంతిభద్రతలు, గత ఎన్నికల్లో ఎదురైన సమస్యలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. సీనియర్ ఎలక్షన్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీష్‌వ్యాస్ నేతృత్వంలోని ఈసీఐ బృందం పలు సూచనలు చేసింది. ఓటర్ల జాబితాలో స్వచ్ఛత అవసరమన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పోలింగ్ శాతం పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగిం చుకు నేలా అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ..... జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 పారదర్శకంగా జరుగుతుందన్నారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం ఉందన్నారు. ఎస్పీ పి.జగదీశ్ శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లం ఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.