గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తున్నానని ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం నాడు పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయతీ వ్యవస్థలకు సంబంధించి 16 డిమాండ్ల సాధన కోసం మూడున్నారేళ్లుగా జగన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నానని కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. పంచాయతీ నిధులను సీఎం జగన్రెడ్డి దొంగిలిస్తున్నారని ఎద్దేవ చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడికి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముత్యాలనాయుడు ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ రోజు అయినా పంచాయతీశాఖ మంత్రి అని తనకు గుర్తు ఉందా అని రాజేంద్రప్రసాద్ దెప్పిపొడిశారు.