జాతీయ రహదారుల కోసం భూములు కోల్పోతున్న రైతులకు సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్.. సం బంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేలైన్లకు భూసేకరణ, పరిహారం పంపిణీపై అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 2,390 ఎకరాల భూమిని కేటాయించామన్నారు. జాతీయ రహదారులకు భూములిచ్చిన రైతులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలన్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. సమీక్షలో పెనుకొండ సబ్‌కలెక్టర్ భరత, ఆర్డీఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణ, రమే్‌షరెడ్డి, జాతీయ రహదారుల ఈఈ మధుసూదన రావు, డీఈ గిడ్డయ్య పాల్గొన్నారు.