తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తో భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త. జనతాదళ్(యునైటెడ్) కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.ఈ మేరకు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లారు. పీకే , లోకేష్ కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఓకే వాహనంలో నారా లోకేష్ , ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. కాగా.. వీరిద్దరి భేటీ జగన్‌కి బిగ్ షాక్ అనే చెప్పాలి. చంద్రబాబు, పీకే కలిస్తే రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ పార్టీకి గడ్డుకాలమేనని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.