కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం గోవాలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముంబయి-కన్యాకుమారి, గోవా-హైదరాబాద్ హైవేల గోవా స్ట్రెచ్‌లో రద్దీని అరికట్టేందుకు 'రింగ్ రోడ్డు' కోసం కన్సల్టెంట్ నియామకాన్ని కేంద్ర మంత్రి సమీక్షించారు. గోవాలోని అంతర్గత రహదారులపై ఎలాంటి టోల్ విధించకూడదని సమావేశంలో నిర్ణయించినట్లు అధికారి తెలిపారు.