దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో సొంత ఇల్లు లేని పేదలకు ఆదివారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి 1300 పట్టాలు పంపిణీ చేయనున్నట్లు దాచేపల్లి తహసీల్దార్ కరుణ కుమార్ తెలిపారు.
దాచేపల్లి జగనన్న కాలనీలో జరిగే బహిరంగ సభలో ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేస్తారని చెప్పారు. లబ్ధిదారులందరూ ఈ సభకు హాజరై ప్రభుత్వం తమకు కేటాయించిన పట్టాలను తీసుకోవాల్సిందిగా కరుణ కుమార్ కోరారు.