కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్-1తో ఆందోళన అవసరం లేదని WHO వెల్లడించింది. రెండు, మూడు నెలల క్రితమే పలు దేశాల్లో ఈ వైరస్ వెలుగుచూసినప్పటికీ .. విస్తృతంగా వ్యాపించలేదని పేర్కొంది.
తీవ్రమైన జబ్బు కలిగించే, రోగనిరోధక శక్తిని తగ్గించే శక్తి జేఎన్-1 వేరియంట్‌కు లేవని తెలిపింది. ఎక్కువ శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రావట్లేదని వివరించింది.