వరికుంటపాడు మండలంలోని కాంచెరువు, గువ్వాడి, ఇసుకపల్లి గ్రామాల్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రతి ఒక్కరికి వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa