సామర్లకోట రైల్వే గూడ్స్ యార్డుకు సోమవారం బీహార్ రాష్ట్రం నుంచి 1300 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతులు అయ్యాయి. ఇప్పటివరకూ ఈ సీజన్ లో 3 గూడ్స్ రైళ్లు బీహార్నుంచి ధాన్యం రవాణా చేయగా సోమవారం నాల్గవ రైలు ధాన్యంతోచేరుకుంది. బీహార్నుంచి సామర్లకోటకు రవాణాఛార్జీలుగా రూ. 36 లక్షలు రైల్వేకు ఆదయంగా సమకూరింది. 100 లారీలకు ఎగుమతులు, దిగుమతులరూపం లోనూ, 100 మంది హమాలీజట్టుకూలీలకు ఎగుమతులు, దిగుమతులతోఉపాధి లభించింది.