మిడుతూరు మండల కేంద్రంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె సోమవారానికి 14వ రోజు కు చేరుకున్నది. సమ్మె శిబిరంలో క్రిస్మస్ పండగ కేక్ కట్ చేసి ప్రభువును ప్రార్థిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి తమ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా వ్యాకాస జిల్లా సహాయ కార్యదర్శి పీ, పకీర్ సాహెబ్, సిఐటియు జిల్లా నాయకులు జి నాగమణి పాల్గొన్నారు.