ఆదిత్య ఎల్1 గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 6వ తేదీన ఆదిత్య ఎల్1ను తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్‌కు చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఆదిత్య ఎల్1 చేరుకోవాల్సిన గమ్యస్థానం భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంటుందని ఆయన తెలిపారు.