ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల జాబితాను ఓ సంస్థ విడుదల చేసింది. సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం భారత్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నోలు టాప్-100 జాబితాలో చోటు సంపాదించాయి. టాప్- 50లో చోటు దక్కించుకున్న ముంబై, హైదరాబాద్ వరుసగా 35, 39 స్థానంలో ఉన్నాయి. ఇక ఢిల్లీ 65వ స్థానంలో ఉండగా.. చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లో నిలిచాయి.