ఏపీలో అధికారుల అవినీతికి నేతలే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. మడకశిర తహసీల్దార్ ను సస్పెండ్ చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. తహసీల్దార్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడారని, సీఎం, మంత్రులే దోచుకుంటుంటే ఇక అధికారులు అవినీతి చేయడంలో వింతేముందని మండిపడ్డారు. సీఎం, మంత్రుల పర్యటనలకు అయ్యే ఖర్చు కింది స్థాయి అధికారులే సమకూర్చాలని ఒత్తిడి పెంచడం అవినీతికి ఆస్కారం ఇవ్వడమేనని అన్నారు.