మానవ అక్రమ రవాణా అనుమానంతో గత నాలుగు రోజులుగా ఫ్రాన్స్ దేశంలో నిర్బంధానికి గురైన రోమేనియన్ విమానం మంగళవారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి 303 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. అయితే మానవ అక్రమ రవాణా అనుమానంతో పారిస్‌కు తూర్పున 150 కి.మీ. దూరంలోని వాట్రీ విమానాశ్రయంలో గురువారం నిర్బంధించింది. ఈ విమానంలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు.