దేశంలోనే అతి పెద్ద మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తో క్రీడోత్సాహం ఉప్పొంగనుంది. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు మొదలవుతాయి. ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్గా నియమించి ప్రభుత్వం క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగస్వాములను చేసింది. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది.