నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే సీఎం జగన్.. మంగళవారం క్రికెటర్గా మారిపోయారు. ప్రత్యర్థి పార్టీలకు ఊహకందని నిర్ణయాలతో రాజకీయాల్లో బౌండరీలు బాదే జగన్.. గ్రౌండ్లో దిగి బ్యాట్ పట్టారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా ప్రాంగణం ఇందుకు వేదికైంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అక్కడకు వెళ్లిన జగన్.. ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు.. ఇక జగన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు పక్కనే ఉన్నారు. ఈ క్రికెట్ వ్యవహారం పూర్తైన తర్వాత కబడ్డీ, కోకో.. ఇలా పలు రంగాల క్రీడాకారుల్ని భుజం తట్టి ముందుకు వెళ్లారు సీఎం జగన్..