ఎస్ కోట సచివాలయం-1 పరిధిలో పుణ్యగిరి, రేగ పుణ్యగిరి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందకపోతే తెలియజేయాలన్నారు. పార్టీ బరోపేతానికి ప్రజలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు.