కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారు. భారత్ న్యాయయాత్ర పేరిట 2024 జనవరి 14న యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ‘భారత్ న్యాయయాత్ర’ చేయాలని నిర్ణయించారు. మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు, పాదయాత్ర రూపంలో ఈ యాత్ర ఉండనుంది. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందన్నారు.