దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె.త్రిపాఠి బుధవారం తెలిపారు. జనవరి 1నుంచి 14వ తేదీ వరకు గుంటూరు-విశాఖ , జనవరి 2 నుంచి 15 వరకు విశాఖ-గుంటూరు(17240) , 1, 2, 3, 5, 6, 8, 9, 10, 12, 13 తేదీల్లో విశాఖ-విజయవాడ- విశాఖ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు.