ధర్మవరం పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుధ్య ఔట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజు బుధవారం కొనసాగింది. సిఐటియు ఉపాధ్యక్షుడు గుండా అనిల్ మాట్లాడుతూ. మున్సిపల్ కార్మికులు యొక్క డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు సమ్మె ఆపేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు అడ్రా మహేష్ బాబు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు సురేష్, పాల్గొన్నారు.