రాష్ట్రంలో పిల్లలు ఇంట్లో సెల్ ఫోన్లో ఆటలకు పరిమితం కాకూడదని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తెలిపారు. ఆయన పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో బుధవారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్య క్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టిందన్నారు. పిల్లలు గ్రౌండ్ లెవెల్ స్థాయిలో ఆటలు ఆడి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.