ఏపి భూమి హక్కుల యాజమాన్యం చట్టంను రద్దు చేయాలని తిరువూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. స్థానిక న్యాయవాదులు ఈ రోజు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంకిరెడ్డి అంజనరెడ్డి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు జీవన్ బాబు, సీనియర్ న్యాయవాదులు తాళ్లూరి రామారావు, మేకల నాగేంద్ర ప్రసాద్, మొగపర్తిసత్యం, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.