ఆరోగ్యశ్రీ సేవలు కలిగిన నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం నేడు ఉదయం చర్చలకు రావాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ను కోరారు. ఈ చర్చల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో మంగళగిరిలో సమావేశం నిర్వహించారు. బకాయిల విడుదలపై ఏం చేద్దామని చర్చించినట్లు తెలుస్తోంది. గురువారం నాటి సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు లేఖ అందించారు. గురువారం జరిగే చర్చల్లో ఈ అసోసియేషన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.