బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలో ఓ హిందూ వ్యాపారవేత్త నివసిస్తున్నారు. ఈ నెల 27న ఉదయం 8.30 నిమిషాలకు ఆయన నివసిస్తున్న ఎవెన్యూలో కాల్పులు జరిగాయి. ఆ ఇంటిని సర్రేలోని లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడి ఇల్లుగా గుర్తించారు. తన కుమారుడి ఇంటిపై దాడి జరిగిందని, కనీసం 14 రౌండ్లు కాల్పులు జరిపారని సతీష్ కుమార్ తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.