ద్వారకా తిరుమల ఆలయ హుండీల లెక్కింపు ద్వారా కేవలం 21 రోజులకు 2.50 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కల్యాణ మండప ఆవరణలో గురువారం అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా లభించిన రూ.2,50,79,543 నగదుతో పాటు భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 338 గ్రాముల బంగారం, 7.906 కేజీల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. రద్దయిన పాతనోట్లు రూ.500(41), 1000(43), 2000(16)తో పాటుగా విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.