ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 08:36 PM

నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 72,240 వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 21,731 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి సెషన్‌లో మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా మోటార్స్ (3.52%), నెస్లే ఇండియా (1.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.12%), టాటా స్టీల్ (0.98%), బజాజ్ ఫైనాన్స్ (0.76%).
టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.41%), ఇన్ఫోసిస్ (-1.29%), టైటాన్ (-1.09%), టెక్ మహీంద్రా (-1.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.03%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com