చైనా నూతన రక్షణశాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ నియమితులయ్యారు. జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది.
ఈ పదవిలో ఉన్న జనరల్ లీ షాంగ్‌ఫూను అక్టోబరులో ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు నెలల తర్వాత డాంగ్ జున్‌కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించింది.