కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దివ్యాంగులైన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అర్హులైన సిబ్బందికి 2016 జూన్ 30 నుంచి ఈ పదోన్నతులు నోషనల్ ప్రాతిపదికన అమలవుతాయని అందులో పేర్కొంది. అయితే ఈ పదోన్నతులు పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు మాత్రం వారు పదోన్నతి బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచే అమలవుతాయి.