మున్సిపల్ కార్మికులకు వైసీపీ పాలనలో చావేగతి అంటూ ఉరితాడు వేసుకుని వినూత్న నిరసన శుక్రవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింప చేయాలని అన్నారు. అధ్యక్షులు కృష్ణయ్య, కార్యదర్శి భాస్కరాచారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.