గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు సర్కార్ వెల్లడించింది.
ఈ రూ.750ను పౌర సరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందించనున్నట్లు తెలిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.