కెనడాలో నివసిస్తున్న గ్యాంగ్‌స్టర్ లఖ్బిర్ సింగ్ లండాను భారతదేశ హోంమంత్రిత్వశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. ‘‘అతడు ఉగ్రవాద స్థావరాలను పెంచడం, దోపిడీ, హత్యలు,
ఐఈడీలు అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు చేకూర్చడం, వాటి ద్వారా ఆదాయాన్ని అందుకోవడం వంటి ఎన్నో క్రిమినల్ కేసుల్లో పాల్గొన్నాడు’’అని మంత్రిత్వశాఖ తెలిపింది.