సామాజిక సాధికార యాత్రకు వస్తున్న జనసందోహాన్ని టీడీపీ చూస్తే గుండెళ్లో రైళ్లు పరుగెడతాయని, చంద్రబాబు గిరిజనుల విషయంలో ఎన్నో డ్రామాలు ఆడాడని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. అయన మాట్లాడుతూ... అల్లూరి సీతారామారాజు అప్పట్లో బ్రిటీష్ బానిస సంకెళ్లు తెంచేందుకు బాణాలు ఎక్కుపెట్టినట్లే వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో గిరిజనులు జగన్ కు వేసి గెలిపించుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసేందుకు జగన్ కంకణ బద్దులై ఉన్నారని, అంతటా అద్భుతమైన రహదారులను నిర్మించి ఆదివాసీల ప్రాంత స్వరూపాన్ని మార్చేశారని కొనియాడారు. అటవీ భూమి హక్కుల చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ గుర్తుకు రాదని, ఇప్పుడు కొత్తగా ఒక మొగుడు.. నాలుగు పెళ్లాల స్కీమ్ పేరుతో ఎన్నికల ముందు ప్రజలకు వస్తున్నారని ధర్మశ్రీ ఎద్దేవా చేసారు. పవన్ కల్యాణ్ ది జనసేన కాదని, అది భజన సేన అని హేళన చేసారు. చంద్రబాబును ఎక్కడ పెట్టాలో పెట్టి.. ఎక్కడికి తొక్కాలో గిరిజన ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. గిరిజనులంతా ఓట్ల బాణాలను ఎక్కుపెట్టి జగన్ ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.